తాడేపల్లి: అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన అల్లుడు మంజునాథ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న తాడేపల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చరీకి తరలించి కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa