తెనాలి: కొన్ని గంటల్లో వివాహం కాగా వధువు అదృశ్యమైన ఘటన తెనాలిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు పట్టణ ఐతానగర్ కు చెందిన 19 ఏళ్ల యువతి స్పిన్నింగ్ మిల్లో పనిచేస్తుంది. ఆమెకు ఈనెల 20న వివాహం నిశ్చయించారు. కొద్ది గంటలలో వివాహం జరగనుండగా యువతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ కోటేశ్వరరావు తెలిపారు.