రాజుపాలెం: జీవాలకు నట్టల నివారణ మందు అందించడం వల్ల వాటిలో వచ్చే వ్యాధులను నివారించవచ్చని పశుసంవర్ధక శాఖ ఏడీ జి. వీరయ్య అన్నారు. మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో సామూహిక నట్టల కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. 500 జీవాలకు నట్టల నివారణ మందు వేశారు. గ్రామ సర్పంచ్ పులి బండ్ల అశోక్, ఎంపీటీసీ బత్తుల సాంబశివరావు, ఆర్బికే సలహా మండలి కన్వీనర్ కేదారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.