తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో హీరోగా భారీస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న సినిమా "మీకు మాత్రమే చెప్తా". ఈ సినిమాలో హీరో గా "పెళ్లి చూపులు" డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.
'ఏ ఎందుకు వై ఇలా .. నాకు మాత్రం ఎందుకిలా .. తప్పు మీద తప్పు తప్పై నాకే ఎందుకిలా?" అంటూ ఈ సాంగ్ సాగుతోంది. వీడియో గేమ్ తరహా యానిమేషన్ విజువల్స్ తో ఈ సాంగ్ ను అందించారు. శివకుమార్ సంగీతం .. రాకేందుమౌళి సాహిత్యం .. హేమచంద్ర - కృష్ణన్ గణేశన్ ఆలాపనతో ఈ పాట సాగింది. యాంకర్ అనసూయ కూడా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. నిర్మాతగా విజయ్ దేవరకొండ ఎంతవరకూ సక్సెస్ అవుతాడో చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa