కంగనా రనౌత్ నటిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ కోసం అమెరికా వెళ్లింది. అక్కడ లాస్‌ఏంజెల్స్‌లో థలైవి లుక్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఓ అవార్డు వేడుకకు వెళ్లారు. యుఎస్‌లో హాలీవుడ్ నిపుణులు క్యాపిటల్ మార్వెల్స్, బ్లాడే రన్నర్ 2049 ఫేమ్ జాసన్ కోలిన్స్ ఆధ్వర్యంలో ఈ లుక్ టెస్ట్స్ జరగనున్నాయి. ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ ఈ పాత్రలో నా హావభావం, ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో తెలియదు కానీ, లుక్ కోసం ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియ చాలా ఆసక్తికరంగా ఉందన్నారు. కానీ నాకు మాత్రం ఇదొక ప్రత్యేకమైన అనుభవం అని తెలిపారు. ఈ బహుభాషా చిత్రం షూటింగ్ దీపావళి తర్వాత మొదలుకానుంది. మొదటి షెడ్యూల్ మైసూర్, కర్నాటకలో ఉండనుంది. ఈ థలైవి చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa