సీనియర్ ఎన్టీఆర్ అభిమాని, దర్శకుడు వైవీఎస్ చౌదరి సుమారు 9 ఏళ్ల తర్వాత నందమూరి జానకి రామ్ తనయుడు నందమూరి తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ కొత్త సినిమాతో వస్తున్నారు. ఈ చిత్రానికి వైవీఎస్ సతీమణి గీత నిర్మాతగా వ్యవహరించనున్నారు. గీత గతంలో 'నిన్నే పెళ్లాడతా', 'సింధూరం' వంటి సినిమాల్లో నటించారు. 'న్యూ ట్యాలెంట్ రోర్స్' బ్యానర్‌పై ఈ సినిమా నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa