టాలీవుడ్ స్టార్ చిరంజీవి టైటిల్ రోల్‌లో నటిస్తున్న 'మన శంకర వర ప్రసాద్ గారు' చిత్రంలో వెంకటేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార కథానాయిక. వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన స్పెషల్ పోస్టర్‌లో ఆయన స్టైలిష్‌గా హెలికాప్టర్‌లోంచి దిగుతూ గన్‌మెన్‌ల పహారాలో కనిపించారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa