ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం అవ్వడానికి కారణం నేనే

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 14, 2025, 04:19 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఆలస్యం కావడానికి ఆయనే కారణమంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు హరీశ్ శంకర్ పూర్తి స్పష్టతనిచ్చారు. ఈ సినిమా ఆలస్యానికి పవన్ ఏమాత్రం కారణం కాదని, కేవలం తన వల్లే కొంత జాప్యం జరిగిందని స్పష్టం చేశారు.హైదరాబాద్‌లోని ఆదిత్య కాలేజీలో 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం నుంచి 'దేఖ్‌లేంగే సాలా' పాట విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో హరీశ్ శంకర్ మాట్లాడుతూ, "పవన్‌గారితో సినిమా చేయడానికి పదేళ్లు పట్టింది. ఈ క్రమంలో ఆయన వల్లే సినిమా లేటైందని చాలా రూమర్స్ వచ్చాయి. కానీ ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. అభిమానులు 'మరో గబ్బర్ సింగ్' కావాలని అడగడంతో కథను చాలాసార్లు మార్చాను. మొదట లవ్ స్టోరీ అనుకున్నాం, కానీ ఫ్యాన్స్ కోరిక మేరకు మార్పులు చేశాం. ఈ ఆలస్యం నా వల్లే జరిగింది" అని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa