బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ప్రఖ్యాత కుంభమేళాకు హాజరు కావాలన్న తన కోరికను వ్యక్తం చేశారు. ముంబైలోని జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో కుంభమేళా థీమ్‌తో ఏర్పాటు చేసిన ఓ పెయింటింగ్ ఎగ్జిబిషన్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయనను కుంభమేళా గురించి ప్రశ్నించారు. "మీరు ఎప్పుడైనా కుంభమేళాకు వెళ్లాలనుకుంటున్నారా?" అని అడగ్గా, ఆయన వెంటనే స్పందించారు. "అవును, తప్పకుండా వెళ్లాలనుకుంటున్నాను. నిజంగా నాకు చాలా ఇష్టం" అని సమాధానమిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa