ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హాట్ టాపిక్ గా మారిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వార్తలు

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 30, 2025, 02:44 PM

టాలీవుడ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ జంట పెళ్లికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. 2026 ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనుందని ప్రముఖ మీడియా తన కథనంలో పేర్కొంది.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ జంటకు 2025 అక్టోబర్ 3నే హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరిగింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వేడుకను నిర్వహించారు. ఉదయ్‌పూర్‌లో జరగబోయే పెళ్లి కూడా పూర్తిగా ప్రైవేట్ వ్యవహారంగా ఉండనుందని, ఆ తర్వాత హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారని సమాచారం. అయితే, విజయ్ కానీ, రష్మిక కానీ ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa