నటి సమంత ప్రస్తుతం వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇటీవల ఆమె 'మైల్ కలెక్టివ్' అనే కొత్త యాక్టివ్ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఈ బ్రాండ్ దుస్తులు తేలికగా, సౌకర్యవంతంగా ఉంటాయని, భారతీయుల శరీరానికి, వాతావరణానికి సరిపోయేలా రూపొందించినట్లు తెలిపారు. గత 12 నెలలుగా ఈ బ్రాండ్‌ను నిర్మించడంలో శ్రమించానని, భయం, సందేహాలను అధిగమించి అభివృద్ధి చేశానని సమంత పేర్కొన్నారు. తన పాత బ్రాండ్ 'సాకీ'ని అప్‌డేట్ చేస్తూ, 'ట్రూలీ స్మా' అనే డిజిటల్ లేబుల్‌ను కూడా నడుపుతున్నారు. 'సీక్రెట్ ఆల్కెమిస్ట్' అనే వెల్నెస్ బ్రాండ్‌లోనూ పెట్టుబడులు పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa