శివకార్తికేయన్ హీరోగా నటించిన 'పరాశక్తి' చిత్రం 2026 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రాటర్‌డామ్‌కు (AZ) అధికారికంగా ఎంపికైంది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చారిత్రక రాజకీయ యాక్షన్ డ్రామా, 1960లలో తమిళనాడులో జరిగిన యాంటీ-హిందీ ఉద్యమం ఆధారంగా రూపొందింది. రవి మోహన్, శ్రీలీల, అథర్వ మురళీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం పట్ల మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa