వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా ద్వారా ఓ సంచలన ప్రకటన చేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మెదలుపెట్టి హీరోగా మారిన నాని త్వరలోనే నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ విషయం వెల్లడిస్తూ నాని తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు.
ఈ ఏడాది ఆరంభంలో ప్రశాంత్ అనే వ్యక్తి నాకొక కథ చెప్పాడు. ఆ సినిమాలో ఓ పాత్రకు వాయిస్ ఓవర్ చెప్పమని అడగడానికి నా దగ్గరకు వచ్చాడు. ఆ కథ చాలా బాగుంది. ప్రొడ్యూసర్ ఎవరు అని అడిగాను. -ప్రొడ్యూసర్ ఎవరూ లేరు. నేనే మేనేజ్ చేస్తున్నా- అన్నాడు. ఆ కథని మేనేజ్ చేయకూడదు. చాలా బాగా తీయాలని నేనే ప్రొడ్యూసర్‌గా మారాను. ఇప్పటికి 80 శాతం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల కాబోతోంది. శనివారం సాయంత్రం టైటిల్ విడుదల చేస్తున్నామ-ని నాని చెప్పాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa