మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘గద్దలకొండ గణేష్’ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ నటనకుగాను ప్రేక్షకులు బాగా ఇంప్రెస్ అయ్యారు. దీంతో ఈ మెగా హీరో చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇకపోతే మెగా హీరోల్లో ఎవరితో కలిసి సినిమా చేయాలని ఉంది అనే ప్రశ్నకు ఇది వరకే ఆ ఛాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చారు. కొన్నాళ్ల క్రితం తాను, ధరమ్ తేజ్ హీరోలుగా తమ వద్దకు మంచి క్లాసికల్ స్టోరీ ఒకటి వచ్చిందని, కానీ యాక్షన్ సినిమా అయితే తామిద్దరం సెట్టవుతామనే ఉద్దేశ్యంతో ఆ కథ చేయలేదని అంటూ సాయిధరమ్ తేజ్‌తో సినిమా చేయడం మాత్రం ఖాయమని, తనకు చరణ్ అన్నయ్యతో కలిసి సినిమా చేయాలని కోరికని, కానీ అది జరుగుతుందో లేదో తెలియదని చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa