సూపర్ స్టార్ Mahesh Babuకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన, ప్రస్తుతం కొత్త సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవల Varanasiలో షూటింగ్ జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.దర్శకధీరుడు S. S. Rajamouli తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ Priyanka Chopraతో పాటు మలయాళ స్టార్ Prithviraj Sukumaran కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా మంచి హైప్ ఏర్పడింది. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి చిన్న అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది.ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. షూటింగ్ కోసం చిత్రబృందం త్వరలోనే Antarcticaకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో Mahesh Babu ఎయిర్‌పోర్ట్‌లో ట్రెండీ లుక్‌లో కనిపించారు. క్యాప్, గాగుల్స్‌తో స్టైలిష్‌గా కనిపించిన ఆయన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ షూటింగ్ అంటార్కిటికాలో ప్రారంభం కానుంది.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుదలై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచాయి. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌తో Mahesh Babu మరోసారి అంతర్జాతీయ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేయనున్నారని అభిమానులు ఆశిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa