'గద్దలకొండ గణేశ్' చిత్రం విజయం తో ఫుల్ జోష్ లో ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్ తో ఒక సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నాన్ని దిల్ రాజు మొదలెట్టినట్టుగా సమాచారం. ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. గతంలో వరుణ్ తేజ్ - వెంకీ అట్లూరి కాంబినేషన్లో వచ్చిన 'తొలిప్రేమ' ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అందువలన ఈ కాంబినేషన్ ను దిల్ రాజు మళ్లీ సెట్ చేసే పనిలో వున్నారని అంటున్నారు. అయితే వరుణ్ తేజ్ తదుపరి చిత్రం, కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడితో వుంది. బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత, దిల్ రాజు ప్రాజెక్టు మొదలవుతుందని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa