‘ధురంధర్ 2: ది రివెంజ్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. కేవలం 11 రోజుల్లోనే ఈ చిత్రం ₹1300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, #RRR (₹1265 కోట్లు), కేజీఎఫ్ చాప్టర్ 2 (₹1300 కోట్లు) చిత్రాల రికార్డులను అధిగమించింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ (₹1800 కోట్లు), ‘బాహుబలి 2’ (₹1890 కోట్లు) చిత్రాల వసూళ్లను అధిగమించడం ఈ సినిమా ముందున్న లక్ష్యం. ఇక ఈ వారం లోనే ‘పుష్ప 2’ రికార్డులను అధిగమించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa