ట్రెండింగ్
Epaper    English    தமிழ்

Kartavya OTT Movie: స్ట్రీమింగ్ ఎప్పుడంటే? రిలీజ్ డేట్ లీక్!

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 30, 2026, 10:48 PM

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘కర్తవ్య’. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌కు పులకిత్ దర్శకత్వం వహించగా, షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక అప్‌డేట్ అధికారికంగా వెలువడింది. ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయకుండా నేరుగా ఓటీటీకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. ఇటీవల రిలీజ్ డేట్‌పై వచ్చిన రూమర్స్‌కు చెక్ పెడుతూ అధికారిక ప్రకటన విడుదల చేశారు.ఈ చిత్రం మే 15 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.‘విధి వర్సెస్ కర్మ’ అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ థ్రిల్లర్‌ను రూపొందించారు. ఇందులో సైఫ్ అలీ ఖాన్ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారు, ఇది కథకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa