పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసి, యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన, తన సినిమాలతోనూ సత్తా చాటుతున్నారు. ఆయన తనయుడు అఖిరా నందన్ కూడా సినిమా రంగ ప్రవేశం చేస్తున్నాడు. తన మొదటి సినిమాతోనే స్టార్ హీరోగా మారాలని అఖిరా ప్రయత్నిస్తున్నాడు. మొదటి సినిమా విజయం సాధిస్తేనే తదుపరి సినిమాలపై ఆసక్తి పెరుగుతుందని, లేదంటే కష్టమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa