ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భీమవరం మెగా అభిమానులకు ఉపాసన ధన్యవాదాలు

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2019, 07:53 PM

భీమవరం మెగా అభిమానులపై రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రత్యేక ట్వీట్ చేశారు. భీమవరంలో చిరు అభిమానులు 250 అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేశారు. దాదాపు అర కిలోమీటర్ వరకు బ్యానర్ కట్టారు. ఈ బ్యానర్ ను ఉపాసన తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అభిమానులకు ఉపాసన ధన్యవాదాలు తెలిపారు. మామయ్య చిరంజీవి హీరోగా, భర్త రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కిన 'సైరా' చిత్రం విడుదల సందర్భంగా ఆసక్తికర ట్వీట్ చేశారు. 'మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు' అని ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa