ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చ‌ర‌ణ్ ను ముద్దాడిన‌ మెగాస్టార్‌

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2019, 07:57 PM

ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు రిలీజ్ అయిన 'సైరా' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సీనియర్‌ నటుడు మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాపై ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ టాక్‌ రావడంతో మెగా ఫ్యామిలీలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. బుధవారం ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ సినిమా బాగుందన్న టాక్‌ వచ్చింది. దీంతో మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.  ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో చిరంజీవి ఒదిగిపోయారని, అందరినీ మెప్పించారని సమీక్షకులు పేర్కొన్నారు. అంచనాలకు తగినట్టుగా సినిమా ఉందని అంటున్నారు. తొలి షోతోనే సూపర్ డూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ ద్వారా రామ్ చరణ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 'ఈ బాస్ బస్టర్ కు ధన్యవాదాలు నాన్నా' అని తన తండ్రికి థ్యాంక్స్ చెప్పాడు. తన తండ్రి తనను ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa