మంచు మనోజ్ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లవుతోంది.ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నానంటూ సోషల్ మీడియాలో కొన్ని నెలల క్రితం ప్రకటించి సంచలనం సృష్టించిన మనోజ్ తండ్రి మోహన్‌బాబు మందలించడంతో ఉదయం చేసిన ట్వీట్‌ని కొన్ని గంటల్లోనే తొలగించాడని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఆ మధ్య ఎన్నికల సమయంలో తండ్రితో కలసి వైసిపి పార్టీలో చేరినానా హడావిడీ సృష్టించాడు. ఓ దశలో చిత్తూరు జిల్లాలో ఓ స్థానం నుంచి మనోజ్ పోటీలోకి దిగుతాడన్న వార్తలూ వచ్చాయి. కానీ ఏదీ జరగలేదు. వైఎస్ జగన్ అనూహ్య విజయాన్ని సాధించిన సందర్భంగా మంచు విష్ణు మాత్రమే కనిపించాడు కానీ మనోజ్ మీడియా మందుకు రాలేదు. అయితే సామాజిక కార్యక్రమాల పేరుతో మంచు మనోజ్ ఎక్కువ శాతం చిత్తూరు జిల్లాలోనే కుటుంబ సభ్యులకు దూరంగా గడుపుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటు మీడియాకు కనిపించక, అటు సినిమాలు చేయక మనోజ్ ఏంచేస్తున్నాడని ఇండస్ట్రీలో వినవస్తోంది. అయితే సొంత చిత్ర నిర్మాణంపై మనోజ్ దృష్టి సారించడంతో పాటు విలన్‌గా నటించేందుకు తండ్రి వద్దే శిక్షణ పొందుతున్నాడని మరో కోణంలో వాదనలూ ఉన్నాయి. ఏది ఏమైనా గతంలో కనిపించినంత యాక్టీవ్‌గా మంచు సోదరులు ముఖ్యంగా మనోజ్ లేడన్నది వాస్తవమే. మరి రానున్న రోజులలో ఏం జరగనుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa