ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెగటివ్ పాత్రలో రాయ్ లక్ష్మి

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2019, 11:36 AM

మీడియా ప్రముఖురాలు ఇంద్రాణి ముఖర్జియా తన కన్న కూతురు షీనా బోరాను కర్కశంగా హత్య చేసిన వైనం అందర్నీ నివ్వెరపోయేలా చేసింది. ఈ కేసు ప్రస్తుతం విచారణలో వుండగా, ఇప్పుడు ఇంద్రాణి జైలు జీవితాన్ని గడుపుతోంది. ఇప్పుడీ హత్యోదంతాన్ని తెలుగులో సినిమాగా రూపొందిస్తున్నారు. విలనిజంతో సాగే ఇంద్రాణి పాత్రను ప్రముఖ నటి రాయ్ లక్ష్మి పోషిస్తుండడం విశేషం. ఈ పాత్ర తనకు దక్కడం పట్ల రాయ్ లక్ష్మి ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటివరకు రకరకాల పాత్రలు చేశానని, నెగటివ్ ఛాయలతో కొనసాగే పాత్రను తొలిసారిగా ఇందులో చేస్తున్నానని ఈ సందర్భంగా ఆమె తెలిపింది ఈ చిత్రానికి స్వరాజ్ దర్శకుడు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa