సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా అన్ని వయసుల ప్రేక్షకుల్లోనూ మహేష్ కు ఉండే ఆదరణ మనకు తెలిసిందే. అందుకే ఈయన తో సినిమాలు చేసేందుకు , అలాగే పలు వ్యాపార సంస్థలు తమ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకునేందుకు పోటీ పడుతుంటాయి.
ఒక్క హిందీ సినిమా చేయకపోయినా కూడా బాలీవుడ్ లో మహేష్ పేరు తెలియని వారు లేరంటే అదేమీ ఆశ్చర్యం కాదు. తాజాగా మహేష్ ప్రఖ్యాత వోగ్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజిపై దర్శనమిచ్చారు. మహేష్ తో పాటుగా దుల్కీర్ సల్మాన్ మరియు నయనతార కూడా ఈ కవర్ పిక్ పై దర్శనమిచ్చారు. మహేష్ ఎప్పటిలానే తన లుక్స్ తో అందరినీ డామినేట్ చేసేసాడు.
నిజానికి వోగ్ మ్యాగజైన్ వారు నిన్న మహేష్ వెనక్కు తిరిగి ఉన్న ఫోటోను తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి ఈ సూపర్ స్టార్ ఎవరో కనుక్కోండి అని ప్రశించారు. ఈ అక్టోబరు నెలకు తమ కవర్ పేజీపై మహేష్ కనిపించనున్నాడని ఈ బ్యాక్ ఫొటోతో వారు హింట్ ఇచ్చారు. అయినా వోగ్ పిచ్చికానీ వెనక్కు తిరిగినా, పక్కకు తిరిగినా ఎలాంటి పొజిషన్లో ఉన్నా మహేష్ ను సినీ ప్రేక్షకులు చిటికెలో కనుక్కుంటారు. అదీ మహేష్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్.
అదే వీరాభిమానులైతే అసలు చూడకుండా కళ్ళు మూసుకునే కనిపెడతారు. ఎందుకంటే ఆ సూపర్ స్టార్ ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్స్ అలాంటివి మరి. ఇంతకీ వోగ్ వారు ఇచ్చిన క్యాప్షన్ ఏంటంటే ఆయన నాలుగేళ్ళ వయసులో సినిమాలో నటించడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఆయనకు అడ్డే లేదు. ఇప్పటికి ముప్పైకి పైగా సినిమాల్లో నటించారు. 20 అవార్డులు గెలుచుకున్నారు.
ట్విట్టర్ లో 8.3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న స్టార్. ఇక ఇన్‌స్టాగ్రామ్ లో 3.6 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఆయన సొంతం. యాక్టర్, ఫిలాంత్రోపిస్ట్. అందుకే ఆయనను సూపర్ స్టార్ అంటారు. అక్టోబర్ 2019 కవర్ పేజీపై దర్శనమిచ్చే ఈ స్టార్ ఎవరో మీరు కనుక్కోగాలరా? అని వోగ్ వారు పోస్ట్ చేయడమే ఆలస్యం మహేష్ బాబు అని జవాబివ్వడం నెటిజన్ల వంతు అయ్యింది.
Stunning #Nayanthara, Handsome #MaheshBabu & #DulquerSalmaan on cover for the 12th anniversary edition of #Vogue magazine #SSMBFORVOGUE pic.twitter.com/qp7aVTSgU7
— Sai Satish PRO (@TheSaiSatish) October 5, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa