ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నితిన్ సినిమాకి వెరైటీ టైటిల్...!

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2019, 12:06 PM

హీరో నితిన్ వరుసగా కొత్త సినిమాల్ని సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే సినిమా చేస్తున్న ఆయన ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది కాకుండా చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో ఇంకో సినిమా చేయనున్నాడు నితిన్. ఈ చిత్రానికి ‘చదరంగం’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఎందుకంటే సినిమాలో చదరంగం ఆటకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. అందుకే ఆ టైటిల్ పెడుతున్నారట. యేలేటి సినిమాలన్నీ కూడా మిస్టరీ, సస్పెన్స్ కూడిన కథలై ఉంటాయి. అలాగే ఈ సినిమా కూడా ఉంటుందట. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ఒక కథానాయిక కాగా ప్రియా ప్రకాష్ వారియర్ రెండో కథానాయకిగా కనిపించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa