ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాప్సీ సినిమాకు ప‌న్ను రాయితీ ఇచ్చిన అశోక్ గెహ్లాట్‌

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 12, 2019, 01:39 AM

హర్యానాకు చెందిన ప్రముఖ షూటింగ్‌ సిస్టర్స్‌ చంద్రో, ప్రకాశీల జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో రూపొందించిన చిత్రం సాండ్‌ కి ఆంఖ్‌.  ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌ 20 మిలియన్ల వ్యూస్‌ను దాటి దూసుకెళ్తోంది.  తుషార్‌ హీరానందని దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌  నిర్మించిన ఈ సిన‌మాలో తాప్సీ పన్ను, భూమి పెడ్నేకర్‌లు  అరవైయేళ్ల బామ్మలుగా నటించారు. . దీపావళి కానుకగా విడుదలవుతోన్న ఈ చిత్రానికి అశోక్‌ గెహ్లాట్‌ సారథ్యంలోని రాజస్థాన్‌ ప్రభుత్వం పన్ను మినహాయింపునిచ్చిం‍ది. మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కార్యాలయం శుక్రవారం ట్విట్టర్‌లో ప్రకటించింది.  


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa