ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆర్.ఆర్.ఆర్' మూవీ విడుదల వాయిదా..?

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 12, 2019, 04:52 PM

'బాహుబలి' తో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2020 జులై 30న విడుదలవుతుందని చిత్రబృందం ప్రకటించింది. అయితే పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందట.


దీంతో సినిమా విడుదల తేదీని వాయిదా వేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం. ముందుగా అనుకున్నట్టు జులై 30న కాకుండా దసరా సమయానికి, లేదా 2021 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారట. `ఆర్ఆర్ఆర్` తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషల్లో కూడా భారీగా విడుదలవుతుంది. కాబట్టి, అన్ని భాషల్లోనూ మంచి రిలీజ్ డేట్ చూసుకుని విడుదల చేస్తారట. బాలీవుడ్ భారీ సినిమాలతో పోటీ పడకుండా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa