ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతిథి పాత్ర కోసం 20 కోట్లు?

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2019, 02:23 PM

ఇండియన్ సినిమా మార్కెట్ విస్తరించేకొద్దీ హీరోల పారితోషకాలు భారీగా పెరిగిపోతున్నాయి. బాలీవుడ్లో ఒక సినిమాకు రూ.50 కోట్లకు పైగా పారితోషకం తీసుకునే హీరోలు ఇప్పుడు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. ఇప్పుడు ఓ బాలీవుడ్ నటుడు ఒక సినిమాలో అతిథి పాత్ర చేస్తున్నందుకు ఏకంగా రూ.20 కోట్లు పారితోషకంగా పుచ్చుకుంటున్నట్లు వార్తలొస్తుండటం విశేషం. ఆ నటుడు అజయ్ దేవగణ్ కాగా.. ఆయన అంత పారితోషకం తీసుకుంటున్నది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్కు అని ప్రచారం జరుగుతుండటం విశేషం. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి రాజమౌళే కొన్ని నెలల కిందట అధికారికంగా ప్రకటించాడు. ఆ పాత్ర సినిమా అంతటా ఉండదని.. ఫ్లాష్ బ్యాక్లో కీలకంగా ఉంటుందని కూడా వెల్లడించాడు. సినిమాలో గరిష్టంగా 45 నిమిషాలు మాత్రమే ఈ పాత్ర ఉంటుందన్నది చిత్ర వర్గాల సమాచారం. మరి ఆర్ఆర్ఆర్ కోసం అజయ్ ఎన్ని కాల్ షీట్లు ఇచ్చాడో ఏమో కానీ.. పారితోషకంగా మాత్రం రూ.20 కోట్లు తీసుకుంటున్నాడట. అజయ్కి దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగే ఉండటం ఉత్తరాదిన ఈ సినిమాకు క్రేజ్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉండటం అన్నిటికీ మించి తన పాత్రతో సినిమాకు వెయిట్ తీసుకురాగల సత్తా ఉన్నవాడు కావడంతో ఆ స్థాయిలో పారితోషకం ఇవ్వడానికి నిర్మాత డీవీవీ దానయ్య వెనుకాడలేదట. అజయ్ త్వరలోనే ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఆలియా భట్ రామ్ చరణ్కు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa