కథకు ప్రాధాన్యమున్న సినిమాలలో నటించి అందరి ప్రశంసలను అందుకున్న నటుడు శివబాలాజీ. సొంత బేనర్ ‘గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్’ ను స్థాపించి ‘స్నేహమేరా జీవితం’ చిత్రాన్ని నిర్మించి విమర్శకుల ప్రశంసలు సైతందక్కించుకున్నారు. ఈ సంవత్సరం మా జాయింట్ సెక్రటరీ గా భాద్యతలు చేపట్టారు. ఈరోజు (అక్టోబర్14 ) శివబాలాజీ పుట్టినరోజును తన సన్నిహితులు, కుటుంబసభ్యులతో కలిసి ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా …శివబాలాజీ మాట్లాడుతూ – “మా బేనర్ ‘గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్’ లో నిర్మించిన ‘స్నేహమేరాజీవితం’ చిత్రానికి నటుడిగా, నిర్మాతగా నాకు మంచి పేరు వచ్చింది. ఆ సినిమా విజయం ఇచ్చిన ఉత్సాహంతో మంచి కథతో మా బేనర్‌లో సెకండ్ మూవీని స్టార్ట్ చేస్తున్నాం. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని చెప్పారు. అలాగే అందరూ కనెక్ట్ అయ్యే విధంగా ఉండే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నానని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa