నందమూరి బాలకృష్ణ కే ఎస్ రవి కుమార్ కాంబినేషన్ లో జై సింహ చిత్రం హిట్ కాగా తాజాసినిమాకి రాయల సింహ అనే పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ చిత్రంలో సోనాలీ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తున్నది. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి వచ్చిన స్టిల్స్ బాలయ్య అభిమనుల్లో కొత్త హుషారు నింపుతున్నాయి. కాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జెమినీ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేసిన జెమినీ టీమ్, దీనితో పాటు టైటిల్ ని కూడా లీక్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఎందుకంటే రూలర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని ట్విట్టర్లో లీక్ చేసిన జెమినీ సంస్ధ, కాసేపటి తర్వాత ఆ ట్వీట్ ని మళ్లీ డిలీట్ చేశారు.చిత్రానికి రాయల సింహ అని నామకరణం చేయాలని అనుకుంటున్నట్లు తెలిపింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ చివరి వారం క్రిస్మస్ కానుకగా విడుదలై, సంక్రాంతి చిత్రాలకు ధీటుగా నిలవనున్నట్టు వినిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa