తెలుగు చిత్ర పరిశ్రమ సత్తాను ఖండాంతరాలు దాటి చూపెట్టిన సినిమా "బాహుబలి" అనడంలో అతిశేయోక్తి లేదు. అయితే ఈ సినిమాకు మరో అరుదైన అదృష్టం దక్కింది. అదేంటంటే రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో శనివారం ప్రదర్శించనున్నారు. హాలీవుడ్ సినిమాలు కాకుండా.. రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శితమవుతున్న తొలి తెలుగు చిత్రమిది. ఇది తెలుగు సినిమాకు దక్కిన గౌరవంగా చెప్పవచ్చు. ఈ సందర్భంగా బాహుబలి మెయిన్ టీమ్ ప్రభాస్, అనుష్క, రాజమౌళి,రానా, శోభు యార్లగడ్డ తదితరులు లండన్ చేరుకున్నారు.ఈ విషయాన్ని తెలియజేస్తూ `రాయల్ రీ యూనియన్ ఆఫ్ బాహుబలి` రాజమౌళి మెసేజ్ పోస్ట్ చేశారు. ఫొటోను షేర్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa