ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అజిత్ చిత్రానికి ‘వాలిమై’ టైటిల్

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 19, 2019, 05:20 PM

మ‌రోసారి నెర్కొండ పార్వాయి చిత్ర  టీంతో క‌లిసి త‌న 60వ చిత్రం చేయ‌బోతున్నాడు నటుడు అజిత్‌. తన  60వ చిత్రం వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుండ‌గా  ఈ చిత్రాన్ని బోనీ క‌పూర్ నిర్మించ‌నున్నాడు. దివంగత నటి  శ్రీదేవికి నివాళులు అర్పించి పూజా కార్య‌క్ర‌మాలు నిర్వహించారు. వాలిమై అనే టైటిల్‌ని ఈ చిత్రానికి ఫిక్స్ చేసిన టీం ఈ  మూవీని 2020 స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. యువ‌న్ శంక‌ర్ రాజా బాణీలు స‌మ‌కూర్చ‌నున్నాడు. న‌య‌న‌తార‌ని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నార‌ట‌. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందిస్తుందట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa