సూపర్ స్టార్ రజనీకాంత్ దీపావళి సందర్భంగా చెన్నైలోని తన నివాసం వద్ద అభిమానులను కలిశారు. అభిమానులు, దేశప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి సుజీత్ సురక్షితంగా బయటకు రావాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు ఈ సందర్భంగా రజినీకాంత్ అన్నారు. తమిళనాడు తిరుచ్చి జిల్లాలోని మనప్పారై బోరుబావిలో పడ్డ సుజీత్‌ను రక్షించేందుకు రెస్క్యూ టీం సహాయక చర్యలు కొనసాగిస్తోన్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa