ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుష్క, కోహ్లీ పిక్ సోషల్ మీడియాలో జోరుగా వైరల్

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 29, 2019, 11:40 AM

బాలీవుడ్ నటి అనుష్క శర్మ..విరాట్ కోహ్లీల జంటకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తాజాగా దీపావళి సందర్భంగా ఈ జంట మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. పండగకు తగ్గట్టే డిజైనర్ లుక్ లో ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీటిచ్చింది ఈ జోడీ. విరాట్-అనుష్క జోడీ ట్రెడిషనల్ లుక్ ఆకట్టుకుంది. వారిద్దరూ  ఎంతో సంబరంగా ఆనందంగా ఉన్న సందర్భమది. విరాట్ ..అనుష్క నవ్వులు చిందిస్తూ  ఒకరి కౌంగిలిలో ఒకరు లీనమయ్యారు. వైట్ కలర్ షర్ట్ లో కొహ్లీ- బ్లాక్ రోజ్  కలర్ ఫ్లోరిష్ జాకెట్ లో అనుష్క ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.




 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa