కూల్ హీరో సుమంత్ చాల సినిమాల తరువాత ‘మళ్లీ రావా’ ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రాలతో మంచి హిట్స్ అందుకున్నాడు. ఆ తరువాత చేసిన సినిమా ప్లాప్ అయిన సోలో హీరోగా తన తదుపరి సినిమా విషయంలో మాత్రం ఏ మాత్రం రాజీపడకుండా స్క్రిప్ట్ పూర్తిగా నచ్చాకే సినిమా ఓకే చేస్తున్నాడు. కాగా 2018 సంవత్సరంలో కేరళలో విడుదలై అక్కడ మంచి హిట్ అందుకున్న మలయాళ చిత్రం ‘పడయోత్తం’ ఆధారంగా రాసుకున్న స్క్రిప్ట్ సుమంత్ కి చాల బాగా నచ్చిందట. అందుకే వెంటనే ఈ సినిమా చేయడానికి అంగీకరించారు. కాగా ఈ సినిమా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో నడిచే కామెడీ చిత్రం అని తెలుస్తోంది. ఈ సినిమాని విను యజ్ఞ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో సుమంత్ సరసన ఐమా అనే కొత్త హీరోయిన్ నటించనుంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ 2019 డిసెంబర్ 15 నుంచి ప్రారంభమవ్వనుంది. తమ్మినేని జనార్థన్ రావు మరియు శర్మ చుక్కా సంయుక్తంగా ఈస్ట్ ఇండియా టాకీస్ మరియు ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాకి సంబధించి పూర్తి వివరాలను రాబోయే రోజుల్లో వెల్లడించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa