టాలీవడ్ టాప్ హీరోయిన్ గా చెలరేగిపోతున్న పూజ హెగ్డే... టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా మెరిసిపోతున్న పూజ హెగ్డే కి బాలీవుడ్ మాత్రం కలిసి రావడం లేదు. తెలుగు సినిమాల్తో బిజీ అయినా.. బాలీవుడ్ మీద ఓ కన్నేసి ఉంచుతున్న పూజ హెగ్డే కి అక్కడ మరోసారి గట్టి షాక్ తగిలింది. భారీ తారాగణంతో తెరకెక్కిన హౌస్ ఫుల్ 4 మొన్న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ బేస్ మీద తెరకెక్కిన ఈ సినిమాలో పూజ హెగ్డే వన్ అఫ్ ద హీరోయిన్. అయితే సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నప్పటికీ... డివైడ్ టాక్ వలన సినిమాకి కలెక్షన్స్ పడిపోవడం.. సినిమాకి ప్లాప్ టాక్ గట్టిగా పడిపోయింది. మరి మోహింజదారో, హౌస్ ఫుల్ 4 డిజాస్టర్స్ తో పూజ హెగ్డే కి బాలీవుడ్ కలిసి రాలేదనే చెప్పాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa