నాగార్జున నిర్మాణంలో .. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా 'హలో' సినిమా తెరకెక్కింది. కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 22వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చారు. ఆడియో రిలీజ్ ను వైజాగ్ లో జరపాలని నాగార్జున నిర్ణయించారు. ఈ నెల 10వ తేదీని ముహూర్తంగా ఖరారు చేశారు. గతంలో విక్రమ్ కుమార్ .. అనూప్ రూబెన్స్ కాంబినేషన్లో వచ్చిన 'ఇష్క్' .. 'మనం' సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. అందువలన ఈ సినిమా ఆడియో కూడా యూత్ మనసులు కొల్లగొట్టేస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో ఒక పాటను అఖిల్ పాడటం విశేషం. ఈ పాటను ఆయన వైజాగ్ వేదికపై కూడా పాడనుండటం ప్రత్యేకత ఆకర్షణగా నిలవనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa