సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే వివాదస్పద సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’కు సంబందించిన ట్రైలర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ ట్రైలర్ ప్రకారం.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఘోర పరాజయం తర్వాత ఏర్పడిన సంఘటన ఆధారంగా ఈ సినిమా వస్తున్నట్లు తెలుస్తోంది. కాగా తాజాగా ఆయన ఆ సినిమాలో కేఏ పాల్ పై తీసిన ఓ సాంగ్‌ను విడుదల చేశాడు. ఏపీ ఎన్నికల్లో.. కేఏ పాల్ హంగామా ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏపీ ఎన్నికల సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరు ఎవరూ మర్చిపోలేరు. తనదైన కామెడీ చేష్టలతో కమెడియన్లను మించిపోయేలా ప్రజలను ఎంటర్ టైన్ చేశారు. ఆయన ప్రసంగాలు, హావభావాలు సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అయ్యాయి.కాగా తాజాగా విడుదల చేసిన ఈ పాట.. కేఏ పాల్‌పై సెటైర్‌గా ఉంటూ.. ఆయన గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలను కామెడీగా చూపిస్తున్నారు. నా టార్గెడ్ మోడీ అంటూ.. తన ప్రమాణ స్వీకారానికి ప్రపంచంలోని అందరూ ప్రధానులు అటెండ్ అవుతారని.. పాకిస్థాన్ యుద్దాన్ని తాను ఆపానని.. ఇలా పాటలో కొన్ని వ్యాఖ్యల్నీ జోడిస్తూ.. చాలా సెటైరికల్‌గా రూపొందించారు.
If JOKER is such a big hit in India a biopic on K A PAUL will be bigger than BAHUBALI 3 ..I heard @ssrajamouli is already in talks with K A PAUL in Washington D C..This K A PAUL only phoned me and told me https://t.co/Y7gqsYgd33
— Ram Gopal Varma (@RGVzoomin) November 2, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa