మహేష్ దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చినవి కొద్దీ చిత్రాలే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నేనొక్కడినే చిత్రానికి వీరిద్దరూ మొదటిసారి కలిసి పనిచేయడం జరిగింది. మొదటి నుండి మహేష్ చిత్రాలకు మణిశర్మ ఆస్థాన సంగీత దర్శకుడిగా వుంటూ వచ్చారు. ఆ తరువాత దూకుడు, ఆగడు వంటి చిత్రాలకు థమన్ సంగీతం అందించడం జరిగింది. నేనొక్కడినే చిత్రం కమర్షియల్ గా ఫెయిల్ అయినా, సాంగ్స్ పరంగా అలరించింది. ఇక మహేష్ శ్రీమంతుడు చిత్రానికి దేవిశ్రీ అందించిన సాంగ్స్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. కాగా భరత్ అనే నేను, మహర్షి చిత్రాల సాంగ్స్ విషయంలో మహేష్ ఫ్యాన్స్ దేవిశ్రీ పెర్పార్మెన్సు పై పెదవి విరిచారు. తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరూ మూవీకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిని ఎంపిక చేయగానే మహేష్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. ఐతే దేవిశ్రీ మహేష్ ఫ్యాన్స్ కి సాంగ్స్ ఒక రేంజ్ లో ఉంటాయని భరోసా ఇస్తున్నారు. ఈ చిత్రంలో వచ్చే మాస్ సాంగ్ ప్రతి పార్టీలో వినబడేలా ఉంటుందని, లవ్ సాంగ్ అంటే ప్రతి లవర్ ని ఆకర్షించేదిగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర ఆ వీడియోని పోస్ట్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ సరసన రష్మిక మందాన నటిస్తుండగా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
After hearing to the mass song by our @ThisIsDSP .keka is a small word to put it. yess devi delivered his promise to our fans and MASSMB will be a treat to all fans and audience. A big thank you Rockstar and @AnilRavipudi Our fans will love u for this Album. pic.twitter.com/A0uT9Uluh2
— Anil Sunkara (@AnilSunkara1) November 2, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa