ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో 'వరల్డ్ ఫేమస్ లవర్ ' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన పూరి జగన్నాథ్ తో కలిసి ఒక సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాకి 'ఫైటర్' అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నారు. టైటిల్ కి తగినట్టుగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు. ఇందుకోసం ఆహార నియమాలు పాటిస్తున్నాననీ, జిమ్ లో గట్టిగానే కసరత్తులు చేస్తున్నాని విజయ్ దేవరకొండ స్వయంగా చెప్పాడు. 'అర్జున్ రెడ్డి'ని మించి తన ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారని అన్నాడు. ఇక ఈ ప్రాజెక్టుపై మరింత క్రేజ్ ను పెంచడం కోసం, విజయ్ దేవరకొండ జోడీగా శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ డేట్స్ కోసం పూరి ట్రై చేస్తున్నాడు. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa