ఒక్క సినిమా చాలు ఇండస్ట్రీలో జాతకం మారిపోవడానికి. ఇప్పుడు శ్రద్ధాకపూర్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇన్నాళ్లూ బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ఈ పేరు ఇప్పుడు తెలుగులోనూ మారుమోగిపోతుంది. దానికి కారణం సాహో సినిమా. ఇంకా విడుదల కాకుండానే తెలుగు హీరోయిన్ అయిపోయింది శ్రధ్ధాకపూర్. అందుకే ఈమె చేసే పనులపై కూడా ఓ కన్నేసి ఉంచుతున్నారు అభిమానులు. సాహోలో నటించడానికి శ్రద్ధాకపూర్ కు ఏకంగా 4 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. నిజానికి ఈమెకు బాలీవుడ్ లో అంత సీన్ లేదు. అక్కడే సినిమాకు 2 కోట్లకు మించి తీసుకోవట్లేదు శ్రద్ధాకపూర్.కానీ తెలుగు సినిమా అనేసరికి రెమ్యునరేషన్ పెంచేసింది ఈ ముద్దుగుమ్మ. పైగా సినిమా బాలీవుడ్ లో విడుదల కానుంది కాబట్టి ఒప్పుకుంది ఈ బ్యూటీ. సాహో షూటింగ్ ఎక్కువగా ముంబై.. రుమేనియా.. దుబాయ్ లలోనే జరగబోతుంది. ఈ చిత్ర షూటింగ్ కు చిన్న బ్రేక్ రావడంతో మధ్యమధ్యలో హాట్ ఫోటోషూట్లు కూడా చేస్తుంది శ్రద్ధాకపూర్. కొత్త షెడ్యూల్ కు ఇంకా టైమ్ ఉండటంతో ఆలోపే మిగిలిన పనులు కూడా చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. 2018 లో సాహో విడుదల కానుంది. మరి ఆ సినిమా రిలీజైన తర్వాత అమ్మాయిగారి హొయలు ఎలా ఉంటాయో..?
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa