యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ హీరోగా పరిచయమై మూడేళ్లయ్యింది. ఈ మూడేళ్ల కాలంలో 8 సినిమాలతో సందడి చేశాడు సాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వి.వి.వినాయక్ చిత్రం అతని 9వ సినిమా. ఇక 'తొలి ప్రేమ' దర్శకుడు ఎ.కరుణాకరన్‌తో ఈ మెగా హీరో తన 10వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఎప్పుడో ఈ సినిమా పూజా కార్యక్రమలు జరుపుకున్నా.. ఈ రోజు (మంగళవారం) నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఐ.ఎం.టి కాలేజ్‌లో చిత్రీకరణ మొదలైంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీత దర్శకుడు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.45గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు సీనియర్ నిర్మాత కె.ఎస్. రామారావు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa