ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్ కందుకూరి విడుద‌ల చేసిన‌ ‘స‌మ‌రం’ ట్రైల‌ర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 30, 2019, 06:55 PM

యూనివ‌ర్స‌ల్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై బ‌షీర్ ఆలూరి ద‌ర్శ‌క‌త్వంలో సాగ‌ర్ గంధం, ప్ర‌గ్యా న‌య‌న్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం `స‌మ‌రం`. క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం  శ్రీనివాస్ వీరంశెట్టి, జీవీఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ప్ర‌స్తుతం  షూటింగ్ పూర్తి చేసుకుని సెన్సార్‌కి సిద్ధ‌మైంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను శ‌నివారం  ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుద‌ల చేసారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాలను తెలియజేస్తూ ఓ సామాజిక సందేశంతో సమరం తెర కెక్కింద‌ని. క్రైమ్ తో పాటు మంచి లవ్ ట్రాక్ కూడా ఈ చిత్రంలో ఉంటుందనిపిస్తోంద‌ని అన్నారు రాజ్ కందూకూరి. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa