బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’ సిరీస్ కొత్త లైఫ్ ఇచ్చింది..పరాజయాలు పాలై డీలా పడ్డ సమయంలో దంబాంగ్ చిత్రాలు అతడి క్రేజ్ ను పెంచేశాయి.. దీంతో ఇప్పుడు దబాంగ్ 3 రెడీ అవుతున్నది. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.. ఇప్పటికే ప్రమోషన్ బిజీలో ఉన్నారు చిత్ర యూనిట్. ఇటీవల మూవీకి సంబంధించి హుద్ హుద్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్ . ఇందులో సల్మాన్ సాధువులతో కలిసి నర్మదా నది దగ్గర డ్యాన్స్ చేస్తాడు. అయితే ఇది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని ఓ వర్గం వారు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. ముఖ్యంగా హిందు జాగృతి సమితి దబాంగ్ 3 చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలని డిమాండ్ చేస్తూ, సెన్సార్ బోర్డ్ వారు సర్టిఫికెట్ ఇవ్వొద్దని కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa