శనివారం జరిగిన లైవ్ లెజెండ్స్ కాన్‌సర్ట్ షో లో ఎల్‌బిస్టేడియం జన సముద్రం తో నిండిపోయింది. సంగీతం సంగ్రామం లో కె.జె.ఏసుదాసు సంగీత దాసుడు. సుస్వరాల బాలుడు బాలసుబ్రమణ్యం. తీపి రాగాల కోయిల కె.ఎస్.చిత్రల సినీ సంగీతం సభికులను ఓలలాడించింది. ఈ ముగ్గురి అపురూప కలయికలో …వివిధ రాష్ట్రాలనుంచి 20 మంది వాద్య బృందం పాల్గొన్న ఈ కార్యక్రమం ఇండియా లోనే మొట్ట మొదటి సంగీతం లైవ్ కాన్ సర్ట్ కావడం విశేషం. కాగా ఈ కార్యకమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ మాట్లాడుతూ నాకు ఈ పాటలు అంటే చాలా ఇష్టం నాకంటే మా నాన్న గారికి ఇంకా ఇష్టం ఏసుదాస్ గారు సంగీతానికి దేవుడు ఇచ్చిన వరం, బాలు గారి పాటలు ఏ గాత్రం లోనియనే చాలా బాగుంటాయి, చిత్ర గారి గాత్రం మాత్రం గాన కోకిలా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో IPS శిఖా గోయల్, IAS జయశ్ రంజన్, సింగర్ సునీతా లతో పాటు పలువురు సినీ నేపథ్య గాయకులు తరలి వచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa