స్టార్ హీరోయిన్ అనుష్క చేస్తున్న కొత్త చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో చాలానే అంచనాలున్నాయి. అందుకు కారణం అనుష్కనే. ఈ లేడీ సూపర్ స్టార్ చేస్తోంది కాబట్టే సినిమాపై ప్రేక్షకులకి అంత ఆసక్తి. కానీ ఈ సినిమాను అనుష్క కోసం రాయలేదని, వేరొక స్టార్ హీరోయిన్ కోసం ఈ స్టోరీ రాశానని అంటున్నారు కోన వెంకట్. ఒకసారి ముంబై నుండి వస్తున్నప్పుడు తాను ప్రయాణిస్తున్న విమానంలోనే అనుష్క కనబడిందని, వెంటనే ఆ స్టోరీని ఆమెకు చెప్పానని, కథ విన్న కొన్ని వారాల తర్వాత అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కోన చెప్పుకొచ్చారు. అలా తన కోసం రాయని కథ అనుష్క చేతికి వచ్చి చేరింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మాధవన్, షాలిని పాండే, అంజలి, సుబ్బరాజ్, హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసెన్ కీలక పాత్రలు చేస్తున్నారు. జనవరి 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa