జబర్థస్త్ షో గత కొన్ని సంవత్సరాలుగా ఈ టీవీలో ప్రసారమయ్యే ఈ షో ఎంత పాపులర్ అయిందో మన అందరికి తెలిసిందే.. ఈ జబర్దస్త్ షోతో చాలా మంది ఎంటర్ ఇచ్చి మంచి కమెడియన్స్ గా పేరు సంపాదించుకున్నారు. అంతేకాదు వీరు సినిమాల్లో కూడా ఛాన్స్ దక్కించుకుని వారి సత్తా చాటుతున్నారు. ఈ షో రోజా గారు, నాగబాబు గారు జడ్జెస్ గా వ్యవహరించేవారు. గత కొన్ని కారణాల వలన గత కొన్ని రోజుల క్రితం నాగబాబు గారు జబర్దస్త్ షో నుండి జడ్జ్ గా తప్పుకున్నారు. దీంతో బాబు పక్కకు తప్పుకోవడం వలన నిర్వాహకులు ఈ షో రేటింగ్స్ లో ఏమన్నా ఛేంజెస్ వస్తాయా అని భయపడ్డారు. కానీ ఈ జబర్డస్త్ షో ఎప్పటిలాగే తన స్థానాన్ని పక్కకి పోనివ్వకుండా సుస్థిరం చేసుకుంది. దీంతో ఈ షోలో జడ్జ్‌గా వ్యవహరించే నాగబాబు గారు కూడా లేకున్న ఆడియన్స్ మాత్రం ఈ జబర్ధస్త్ కామెడీ షోని చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారన్న సంగతి వారికి స్పష్టమైంది. ఇక నాగబాబు లేకపోయినా.. జబర్దస్త్ కామెడీ షో దాని బ్రాండింగ్ తో పాటు రేటింగ్ ను నిలబెట్టుకుంది. ప్రస్తుతం ఈ షోలో రోజా ఒక్కరే జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈటీవీలో ప్రసారమయ్యే అన్ని ప్రోగ్రామ్స్ కంటే ఈ షోకే రేటింగ్స్ ఎక్కువ. కానీ తాజాగా బార్క్ ప్రకటించిన రేటింగ్స్‌లో ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ షో కు గట్టి షాక్ ఇచ్చింది ఈటీవీ న్యూస్. ఈటీవీలో ప్రతి రోజు ఉదయం 7 గంటలకు, రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఈటీవీ న్యూస్.. జబర్దస్త్ షో రేటింగ్స్ ను క్రాస్ చేయడం నిర్వాహకులను కలవరపెడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa