ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనూ ఇమ్మాన్యుయేల్ కి పెరుగుతోన్న క్రేజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 21, 2017, 06:45 PM

ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి పరిచమైన గ్లామర్ కథానాయికలలో అనూ ఇమ్మాన్యుయేల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. విశాలమైన కళ్లతో .. ఆకర్షణీయమైన నవ్వుతో ఈ అమ్మడు పొలోమంటూ కుర్రకారు మనసులను దోచేస్తోంది. కెరియర్ ఆరంభంలోనే పవన్ సరసన ఛాన్స్ కొట్టేసిందంటే మాటలా మరి. పవన్ జోడీగా ఈ అమ్మాయి చేసిన 'అజ్ఞాతవాసి' విడుదల కాకముందే, వరుస అవకాశాలు వచ్చేస్తున్నాయి. ఈ సినిమా హిట్ కొడితే అమ్మాయి ఒక రేంజ్ లో దూసుకెళుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 పవన్ సరసన నటించిన ఈ సుందరి, బన్నీ జోడీగా 'నా పేరు సూర్య' చేస్తోంది. చరణ్ - బోయపాటి కాంబినేషన్లోని సినిమాలోనూ ఈ అమ్మాయినే తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ చేయనున్న సినిమా కోసం కూడా ఈ అమ్మాయినే అడిగారట. ఇందుకోసం అమ్మడు పారితోషికంగా భారీ మొత్తమే అడిగిందని టాక్. ఇక మారుతి - నాగ చైతన్య సినిమాలోనూ అనూ ఇమ్మాన్యుయేల్ చేస్తోన్న సంగతి తెలిసిందే.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa