దర్శకుడు సందీప్ వంగ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి భారీ బ్లాక్ బస్టర్ అందుకుని అక్కడ స్టార్ డైరెక్టర్ అయిపోయారు. దీంతో అక్కడి నిర్మాతలు సందీప్ సినిమాలకు ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి ముందుకొస్తున్నారు. ‘కబీర్ సింగ్’ చిత్ర నిర్మాత టీ-సిరీస్ భూషణ్ కుమార్, సినీ 1 స్టూడియోస్ మురాద్ ఖేతాని కలిసి సందీప్ తర్వాతి సినిమాను భారీ స్థాయిలో నిర్మించడానికి ముందుకొచ్చారు. వీరితోపాటే సందీప్ సోదరుడు, ‘అర్జున్ రెడ్డి’ నిర్మాత ప్రణయ్ వంగ కూడా చిత్ర నిర్మాణంలో పాలుపంచుకోనున్నారు. ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ ఇదొక పాన్ ఇండియా సినిమా, క్రైమ్ డ్రామాగా ఉండబోతోందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa