బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇటలీ వివాహం అనంతరం ఆర్కిటిక్ లో హనీమూన్ పూర్తి చేసుకుని ఇండియా తిరిగి వచ్చారు. పెళ్లి వేడుక ప్రైవేట్‍గా జరుగడంతో ఢిల్లీలో గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు.తమ వెడ్డింగ్ రిసెప్షన్ కు రావాల్సిందిగా విరాట్-కోహ్లి స్వయంగా ప్రధాన మంత్రిని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం జరిగిన వేడుకకు మోడీ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.వెడ్డింగ్ రిసెప్షన్లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులు ధరించిన అనుష్క-విరాట్ లుక్ అదిరిపోయింది.వెడ్డింగ్ రిసెప్షన్లో అనుష్క, విరాట్ వేసుకున్న దుస్తులు సబ్యాసాచి ముఖర్జీ డిజైన్ చేశారు. ఎరుపు రంగు బెనారస్ చేనేత చీర ధరించిన అనుష్క సంప్రదాయ లుక్ లో ఆకట్టుకుంది. అనుష్కకు ఏ మాత్రం తీసిపోకుండా కోహ్లి నలుపురంగ స్టక్చర్ ఉన్న 18 క్యారెట్ల బంగారు గుండీలు పొదిగిన సిగ్నేచర్ బంద్‌గాలా, సిల్క్ కుర్తా ధరించారు.ఢిల్లీ చాణక్యపురిలోని తాజ్ హోటల్ దర్బార్ హాలులో ఈ వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. అతిథుల కోసం పసందైన వంటకాలు వడ్డించారు.తమ పెళ్లి వేడుక, వెడ్డింగ్ రిసెప్షన్ జీవితంలో ఎప్పటికీ గుర్తుండి పోయేలా అనుష్క-విరాట్ ముందు నుండీ ప్లాన్ చేసుకున్నారు. వారు అనుకున్న విధంగా ఏర్పాట్లన్నీ సజావుగా సాగాయి. డిసెంబర్ 11న వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో కూడా వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa